ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది సెలవులు రద్దు... సర్కార్ ఆదేశాలు

by velandi.Saikiran |

ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది సెలవులు రద్దు... సర్కార్ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ వాతావరణం కారణంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం అదికారులకు కూడా లీవు మంజూరు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం రాత్రి ఢిల్లీ ప్రభుత్వ సర్వీస్ విభాగం ఈ విషయమై ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దాడుల నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ప్రకటించేంతవరకు ఏ అధికారికీ లీవులు మంజూరు చేయవద్దని ఆదేశించింది.

జాతీయ రాజధానిలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు తమ కింది అదికారులతో సమావేశాలు నిర్వహించారు. ఏదైన అత్యవసర పరస్థితి తలెత్తితే ఆరోగ్య, విపత్తు నిర్వహణను సమీక్షించేందుకు ఈ సమావేశాలను ఏర్పర్చినట్లు అదికారులు తెలిపారు. కాగా, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరుకున్నాయి. పంజాబ్, జమ్మూ, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలపై పాక్ ద్రోన్ దాడి జరగ్గా భారత రక్షణ వ్యవస్థలు వాటిని నిర్వీర్యం చేశాయి. ద్రోన్ దాడి జరిగిన ప్రాంతాలను మొత్తంగా బ్లాక్ అవుట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మస్థలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ని అర్థంతరంగా నిలిపేశారు.

Next Story