- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ కుట్రలు.. ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ఆదేశాలు !
సీజ్‌ఫైర్‌ను పాకిస్థాన్ ( Pakisthan) ఉల్లంఘించిన నేపథ్యంలో..ఢిల్లీ ఎయిర్ పోర్టు ( Delhi Airport ) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : సీజ్‌ఫైర్‌ను పాకిస్థాన్ ( Pakisthan) ఉల్లంఘించిన నేపథ్యంలో..ఢిల్లీ ఎయిర్ పోర్టు ( Delhi Airport ) కీలక ప్రకటన చేసింది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయంలో విమాన సేవలు సాధారణంగా కొనసాగుతాయని తెలిపారు అధికారులు. వాతావరణ మార్పులు, భద్రతా చర్యల కారణంగా.. కొన్ని షెడ్యూల్‌లో మార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రతా తనిఖీలకు కొంత సమయం కేటాయించాలని ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ ( PM modi). యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ కాల్పులు జరిపితే ఇండియా కూడా ఎదురుదాడి చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉద్రిక్తతల విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదన్నారు. ఇక తెగించి పోరాటం చేస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్థాన్‌తో POK, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశంపై చర్చలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
Passenger Advisory issued at 13:36 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/5PabwcVh6B
— Delhi Airport (@DelhiAirport) May 11, 2025






