Indian Army: సైన్యం ప్రధాని మోడీ కాళ్లు మొక్కాలి.. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-16 10:47:53  IST  )

కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే ఆ రాష్ట్ర డిఫ్యూటీ సీఎం సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Indian Army: సైన్యం ప్రధాని మోడీ కాళ్లు మొక్కాలి.. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు మరిచిపోకముందే ఇప్పుడు అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం (Madhya Pradesh, Deputy CM) జగదీష్ దేవ్డా సైన్యంపై (Indian Army) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహెల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఈ బలోమేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అందుకు దేశం, సైన్యం ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులను, వాళ్లను పోషిస్తున్న వాళ్లను నిర్మూలించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ప్రధాని చెప్పారని, అది చేసి చూపించిన ప్రధానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలతోపాటు సైన్యం ప్రధాని కాళ్లకు మొక్కాలని, పాకిస్తాన్‌కు మోడీ ఇచ్చిన జవాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. కాగా జగదీశ్ దేవ్డా (Jagdish Devda) వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది సైన్యాన్ని అవమానించడమేనని, బీజేపీ నాయకులు సైన్యం పట్ల తమ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా డిమాండ్ చేసింది.

వ్యోమికా సింగ్ మతంపై మాజీ ఎంపీ..

మరోవైపు ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Vyomika Singh) మతంపై సమాజ్ వాదీ మార్టీ నేత, మాజీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే ఆమె మతంపై రచ్చ చేస్తున్నారని, అదే వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబట్టి ఆమెను వదిలేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఫైర్ అ్యయారు. దేశానికి సేవలు చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడటం నీచమన్నారు. దేశం కోసం తమ ప్రాణాల్ని సైతం అర్పించే వారిపట్ల ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని తేల్చి చెప్పారు.

Next Story