Congress: ఆపరేషన్ సిందూర్ భేష్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తున్నామని తెలిపింది.

Congress: ఆపరేషన్ సిందూర్ భేష్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని తెలిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (cwc) బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాక్‌కు తగిన సమాధానం ఇచ్చిన భద్రతా దళాల చర్యల పట్ల గర్విస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతిస్తామన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలపై ధైర్యం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.

సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని స్పష్టం చేశారు. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ పై సీడబ్లూసీలో చర్చించామన్నారు. విజయవంతంగా ఆపరేషన్ చేపట్టిన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది దేశానికి సంబంధించిన అంశమని, దేశ ప్రయోజనాలను కాపాడటానికి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Next Story