భద్రంగా ఉండండి.. ప్రజలకు జమ్మూకశ్మీర్ సీఎం సూచన

by Phanindra |

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సీఎం ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.

భద్రంగా ఉండండి.. ప్రజలకు జమ్మూకశ్మీర్ సీఎం సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ చీకటిలో మునిగిపోయింది. ఈ ప్రాంతమంతా బ్లాకౌట్ అమలు చేస్తున్న సైనిక దళాలు.. పాక్ నుంచి వచ్చే డ్రోన్లను నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు భద్రంగా ఉండాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. బోర్డర్‌లో పాకిస్తాన్ దళాలు నిబంధనలు ఉల్లంఘించి ప్రజలపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.

‘జమ్ము, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దు. దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి. లేదంటే దగ్గరలో ప్రశాంతంగా ఉండగలిగే ప్రాంతంలో తలదాచుకొండి. రూమర్లను నమ్మొద్దు. తెలిసీ తెలియని వార్తలను ప్రచారం చెయ్యకండి. ఈ కష్టకాలం నుంచి మనందరం కలిసి బయటపడతాం’ అని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story