- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ చైనా కీలక వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిణామాల వేళ చైనా (China) విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) మాట్లాడారు

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిణామాల వేళ చైనా (China) విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని తెలిపారు. పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని కోరారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయకుండా ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాము కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ సమాజంతో కలిసి ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెడీగా ఉన్నామన్నారు.
ఉగ్రదాడి తర్వాత..
పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి తర్వాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ప్రపంచ దేశాల సలహాదారులు, కార్యదర్శులతో మాట్లాడారు. ఇందులోభాగంగా చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ.. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు. అయితే, పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్ వ్యవహరిస్తే.. భారత్ నుంచి ప్రతిస్పందన మరింత గట్టిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులకు దోవల్ వివరించారు. గురువారం రాత్రి మిస్సైల్స్, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలతో భారత్ పైకి పాక్ దాడికి పాల్పడింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లే లక్ష్యంగా డ్రోన్లను వాడింది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్‌ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. అంతేకాకుండా, సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది.






