- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదు.. సందేశం : కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ తయారీ యూనిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను లక్నో ఎందుకు రాలేకపోయానో అందరికి తెలుసన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారం తీర్చుకున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ తయారీ యూనిట్ (Brahmos Unit)ను వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను లక్నో ఎందుకు రాలేకపోయానో అందరికి తెలుసన్నారు. ఇదే రోజున శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేశారని, 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తిచేశారని వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలిపారు.
భారత్ ఉగ్రవాదానికి ధీటైన సమాధానమిస్తోందన్నారు. బ్రహ్మోస్ కేవలం ఒక ఆయుధం కాదని, అదొక సందేశమని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కోసమే ఆపరేషన్ సిందూర్ ను చేపట్టామని స్పష్టం చేశారు. భారత ఆర్మీ.. రావల్పిండి హెడ్ క్వార్టర్స్ (Ravalpindi Head Quarters)పై దాడితో పాటు.. పాక్ లోకి చొచ్చుకెళ్లి అనేక దాడులు చేసింది కానీ.. పాక్ ప్రజలపై దాడి చేయలేదన్నారు. పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో మితిమీరి ప్రవర్తించిందని దుయ్యబట్టారు. భారత ప్రజలపై దాడి చేసి.. అమాయకుల్ని పొట్టన పెట్టుకుందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.






