రాష్ట్రపతితో త్రివిధ దళాధిపతుల భేటీ.. ‘ఆపరేషన్ సిందూర్ పై వివరణ

by Malleboina Mahesh |   (  Updated:2025-05-14 07:42:00  IST  )

కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చారు. ఈ టెర్రర్ ఎటాక్ పై చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీకి కేంద్ర పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.

రాష్ట్రపతితో త్రివిధ దళాధిపతుల భేటీ.. ‘ఆపరేషన్ సిందూర్ పై వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చారు. ఈ టెర్రర్ ఎటాక్ పై చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీకి కేంద్ర పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో భారత సాయుధ దళాలు 2025 మే 6-7 మధ్య రాత్రి 1:05 నుండి 1:30 వరకు 'ఆపరేషన్ సిందూర్' ను విజయవంతంగా నిర్వహించి.. 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. కాగా.. రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ సిబ్బంది అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అలాగే కాల్పుల విరమణ, సరిహద్దు భద్రతల గురించి కూడా రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల పరాక్రమం, అంకితభావాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు.

Next Story