Operation Sindoor: రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్.. పోలీసులకు సెలవులు రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-08 08:04:22  IST  )

రెండో రోజు కూడా పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేతపై భారత జవాన్లు ఆపరేషనమ్ సింధూర్‌ను కొనసాగిస్తున్నారు..

Operation Sindoor: రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్.. పోలీసులకు సెలవులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: రెండో రోజు కూడా పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేతపై భారత జవాన్లు(Indian Jawans) ఆపరేషనమ్ సింధూర్‌(Operation Sindoor)ను కొనసాగిస్తున్నారు. పహల్గాం దాడి(Pahalgam Attack)కి ప్రతీకారంగా ఈ ఆపరేషన్‌‌ను ప్రారంభించింది. తొలి పలువురు ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం హైఅలర్ట్(High Allert) ప్రకటించింది. రాజస్థాన్(Rajastan) తో పాటు పంజాబ్‌(Panjab)లోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా పోలీసులకు సెలవులు రద్దు చేసింది. బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ఉద్రిక్తతను చోటు చేసుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పHigh alert in Punjab and Rajasthanరిస్థితులను ఎదుర్కొంటామని వెల్లడించారు.

మరోవైపు జమ్మూకాశ్మీర్‌లోని LOC వెంబడి గ్రామాలపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఫిరంగి, మోర్టార్ షెల్లింగ్‌లతో బాంబు దాడులు చేస్తోంది. దీంతో భారత జవాన మృతి చెందగా మరో నలుగురు చిన్నారు సహా మొత్తం 12 మంది భారత పౌరులు మృతి చెందారు.

Next Story