Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ మాకే కావాలి..! టైటిల్ కోసం బాలీవుడ్‌ నిర్మాణ సంస్థల పోటా పోటీ.. పర్మిషన్ కోసం దరఖాస్తులు..!

by Javid Pasha |   (  Updated:2025-05-08 11:01:29  IST  )

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ మాకే కావాలి..! టైటిల్ కోసం బాలీవుడ్‌ నిర్మాణ సంస్థల పోటా పోటీ.. పర్మిషన్ కోసం దరఖాస్తులు..!

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ మాకే కావాలి..! టైటిల్ కోసం బాలీవుడ్‌ నిర్మాణ సంస్థల పోటా పోటీ.. పర్మిషన్ కోసం దరఖాస్తులు..!
X

దిశ, సినిమా : ఓ వైపు ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ కొనసాగుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో మన సైనికులు ఇప్పటికే సక్సెస్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకలను మట్టుబెట్టే పనిలో ఇండియన్ ఆర్మీ నిమగ్నమై ఉంది. ఇదిలా ఉండగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా తీసి లాభాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు. అందుకోసం దరఖాస్తు కూడా చేసిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ఒకటో, రెండో కాదు, ఏకంగా 15 బాలీవుడ్ నిర్మాణ సంస్థలు (production houses) పోటీ పడుతున్నాయి. అనుమతికోసం ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్‌(Indian Motion Picture Producers Association)లో దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో జీ స్టూడియోస్(Zee Studios), టీ సిరీస్(Tea series) వంటి ఫేమస్ సంస్థలు ఉండటం విశేషం.

ఇకపోతే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరైన అశోక్ పండిట్(Ashok Pandit) స్పందిస్తూ.. ‘టైటిల్ కోసం దరఖాస్తు అయితే చేసుకున్నాం. అయితే ఇదే టాపిక్‌పై మూవీ తెరకెక్కుతుందా లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే కన్ఫామ్ చేయలేం’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పాపులర్ టైటిల్ కాబట్టి సినిమాలకు పెట్టుకోవాలనే ఆలోచన రావడం సహజమే. దర్శక, నిర్మాతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కాగా పాకిస్తాన్ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు అశోక్ పండిట్.


Next Story