- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ దాడులు చేస్తున్న పాక్.. జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లో బ్లాక్ అవుట్
భారత్ పై గురువారం దాడులు చేసిన పాకిస్థాన్ నేడు కూడా మళ్లీ దాడులకు తెగబడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్ పై గురువారం దాడులు చేసిన పాకిస్థాన్ నేడు కూడా మళ్లీ దాడులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరుపుతోంది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్, జైసల్మేర్‌లో సైరెన్లు మోగడంతో పాటూ బ్లాక్ అవుట్ విధించారు. పాకిస్థాన్ దాడులు మొదలు పెట్టడంతో బ్లాక్ అవుట్ విధించి ఆ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముఖ్యం యూరి, పూంచ్ ప్రాంతాల్లో పాక్ ఎక్కువగా దాడులు చేస్తోంది. సాంబా సెక్టార్ లో మరోసారి డ్రోన్లు చక్కర్లు కొట్టడంతో వాటిని ఇండియన్ ఆర్మీ పేల్చివేసింది. వరుస దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాత్రి అవ్వగానే పాక్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
Next Story






