ఎవరూ బయటకు రావద్దు..అమృత్‌సర్‌లో మళ్లీ రెడ్ అలర్ట్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-11 00:46:09  IST  )

ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కానీ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.

ఎవరూ బయటకు రావద్దు..అమృత్‌సర్‌లో మళ్లీ రెడ్ అలర్ట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కానీ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇండియాలోని సరిహద్దు ప్రాంతాల్లోకి పాక్ డ్రోన్లను పంపింది. జమ్మూ కశ్మీర్ లో పాక్ ఆర్మీ కాల్పులు సైతం జరిపింది. కొన్ని డ్రోన్లు చక్కర్లు కొట్టినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. మరోవైపు పంజాబ్ లోని అమృత్‌సర్‌లోనూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రాత్రి అమృత్‌సర్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయని వార్తలు రాగా ఉదయం కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.

ఉదయం 5 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో వెంటనే సైరన్లు మోగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమృత్ స‌ర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ సాక్షి సావనే ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అమృత్ సర్ లో రెడ్ అల‌ర్ట్ కొన‌సాగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు ఇంట్లో నుండి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని చెప్పారు. కిటికీల వ‌ద్ద కూడా నిలుచోవ‌ద్ద‌ని , బాల్క‌నీలో ఉండ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రూ బ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని త‌దుపరి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Next Story