- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్ ఖురేషిపై బీజేపీ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్
ఆపరేషన్ సిందూర్లో కీలకంగా వ్యవహరించిన కల్నల్ ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి విజయ్ షా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్లో కీలకంగా వ్యవహరించిన కల్నల్ ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి విజయ్ షా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మోడీ పంపించారు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ విజయ్ షా వ్యాఖ్యలపై స్పందించారు.
కల్నల్ ఖురేషీపై మంత్రి షా చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పారు. బీజేపీ మత తత్వానికి సంబంధించి అన్ని పరిమితులను దాటిందన్నాారు. ఆ మంత్రిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. మహిళలపై చులకనగా మాట్లాడటం ఆయనకు అలవాటేనన్నారు. మరోవైపు విజయ్ షా చేసిన కామెంట్లు వివాదాస్పదం కావడంతో ఆయన దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను అలా అనలేదని ఆమె నా సోదరి ఆమె ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకుంది అని అన్నానని భుకాయిస్తున్నారు.






