భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత... బంగ్లాదేశ్ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-10 03:37:08  IST  )

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది...

భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత... బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రమైన బంగ్లాదేశ్(Bangladesh) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ గగనలతలం వైపు తమ విమాన రాకపోకలు నిలిపివేసింది. తమ విమానాలను టొరంటో, లండన్ మరియు రోమ్‌లకు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు మే 31వరకూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది.

మరోవైపు భారత సరిహద్దులో భీకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్థాన్ సైన్యం చర్యలు తీవ్రతరం అయ్యాయి. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ మిసైల్స్ తో విరుచుకుపడింది. మరిన్ని ప్రముఖ స్థావరాలపై దాడు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అటు పాకిస్థాన్ సైతం భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ పౌరుల ప్రాణాలు తీసే లక్ష్యంతో డ్రోన్స్, ప్రక్షేపకాలతో దాడులకు దిగింది. దీంతో పాక్ దుశ్చర్యలను భారత్ దీటుగా ఎదుర్కొంటోంది. డ్రోన్స్, ప్రక్షేపకాలను నిర్వీర్యం చేస్తోంది.

Next Story