Inida Pakistan War : బీ అలర్ట్ గా ఉండండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

by Muthe.Rajitha |

గురువారం సాయంత్రం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు, మిసైల్స్, రాకెట్స్ తో దాడులకు దిగగా భారత్ అందుకు ధీటుగా బదులు ఇచ్చింది.

Inida Pakistan War : బీ అలర్ట్ గా ఉండండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : గురువారం సాయంత్రం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు, మిసైల్స్, రాకెట్స్ తో దాడులకు దిగగా భారత్ అందుకు ధీటుగా బదులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గురువారం త్రివిధ దళాల అధిపతులు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అనంతరం.. వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. నిరంతరం అప్రమత్తంగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.

సివిల్‌ డిఫెన్స్‌ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు వార్తలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టడం, కీలకమైన మౌలిక సౌకర్యాల భద్రత కల్పించేలా చూడడం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల అధికారులు, క్షేత్ర స్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని కూడా ప్రధాని సూచించారు.

పహాల్గం ఉగ్రదాడి(Pahalgam Terror Attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాక్ పై ప్రతిదాడికి దిగింది. పాక్ కీలక నగరాలైన ఇస్లామాబాద్(Islamabad), లాహోర్(Lahor) పై వైమానిక దాడులు, మిస్సైల్స్ తో విరుచుకు పడింది. కరాచీ పోర్టు(Karachi Port)ను పూర్తిగా ధ్వంసం చేసింది.

Next Story