ఐపీఎల్‌ 2025 రద్దుపై బీసీసీఐ క్లారిటీ.. విదేశాలకు తరలింపు ?

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... గురువారం రోజు జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్

ఐపీఎల్‌ 2025 రద్దుపై బీసీసీఐ క్లారిటీ.. విదేశాలకు తరలింపు ?
X

*ఐపీఎల్‌ రద్దు వార్తలపై బీసీసీఐ క్లారిటీ*

*విదేశాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు*

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... గురువారం రోజు జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఐపిఎల్ 2025 టోర్నమెంట్ రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉందని... సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలు లేవని భారత క్రికెట్ నియంత్రణ మండలి క్లారిటీ ఇచ్చింది. సెక్యూర్ స్టేట్స్ లో దేశాలలో నిర్వహించేలా ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని కూడా వివరించింది. అవసరమైతే ఢిల్లీ, లక్నో, జైపూర్, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నై ఇలాంటి సురక్షిత ప్రాంతాలు తమ ఆప్షన్ లో ఉన్నాయని వివరించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Next Story