జనగణమన పాడిన బలూచిస్థాన్ చిన్నారులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-12 12:46:20  IST  )

పాకిస్థాన్ భారత్‌కు పక్కలో బల్లెంలా మారితే ఆ దేశంలోని బలూచిస్తాన్ మాత్రం భారత్‌తో దోస్తీ కోసం ఎదురు చూస్తోంది.

జనగణమన పాడిన బలూచిస్థాన్ చిన్నారులు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ భారత్‌కు పక్కలో బల్లెంలా మారితే ఆ దేశంలోని బలూచిస్తాన్ మాత్రం భారత్‌తో దోస్తీ కోసం ఎదురు చూస్తోంది. భారత్ మద్దతు ఇస్తే పాకిస్థాన్‌నే లేపేస్తామని ప్రకటనలు చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ చిన్నారు ఇద్దరు భారత దేశ జాతీయ గీతాన్ని పాడి ఆకట్టుకున్నారు. జెండా ముందు నిలుచుని వారి డ్రెస్సులకు సైతం బలూచిస్తాన్ మరియు భారత్ జెండాలను పెట్టుకుని జనగనమన పాడారు.

పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాకిస్థానీ ఉగ్రవాద దాడి బాధితులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు నిన్న కొంతమంది భారత్ జెండాలను, బలూచిస్తాన్ జెండాలను పట్టుకని నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇదిలా ఉంటే తమ దేశాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుని వేధింపులకు పాల్పడుతోందని బలుచిస్తాన్ వాసులు మండిపడుతున్నారు. అందువల్లే స్వతంత్య్రం కోసం బలూచిస్తాన్ ఆర్మీ పోరాడుతోంది. భారత్ పాక్ తో యుద్దం చేస్తే కలిసి ఫైట్ చేద్దామని సైతం తమ సపోర్ట్ ప్రకటించింది.

Next Story