- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్‌పై వ్యతిరేక పోస్టులు..జ్యుడిషియల్ కస్టడీకి ప్రొఫెసర్
భారత్‌లో ఉంటూనే కొందరు ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో శతృదేశానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో ఉంటూనే కొందరు ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో శతృదేశానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాంటి పనే హర్యానాలోని అశోక యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ అలీ ఖాన్ కూడా చేశాడు. కల్నల్ సోఫియా ఖురేషీని ప్రశంసిస్తున్న మితవాదులు మూక హత్యల బాధితులకు, బుల్డోజర్లతో ధ్వంసం అయ్యే ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేయాలన్నాడు. సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికాసింద్ చేసిన ఆపరేషన్ క్షేత్ర స్థాయిలో కనిపించాలని లేదంటే వంచనే అవుతుందని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఖాన్ తీరుపై హర్యానా మమిళా కమిషన్ చైర్ పర్సన్ రేణూ బాటియా ఫిర్యాదుతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కాగా తాగాజా కోర్టు అతడికి 14 రోజుల పాటూ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. హర్యానా పోలీసులు 7 రోజుల పాటూ రిమాండ్ విధించాలని కోరగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ జైలుకు పంపించింది.






