- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌర రక్షణ వాలంటీర్ల కోసం ఆర్మీ నోటిఫికేషన్.. వేలాదిగా పోటెత్తిన యువకులు (వీడియో)
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారతదేశంలో పౌర రక్షణ విభాగం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ (DGCD) పౌర రక్షణ వాలంటీర్ల కోసం (civil defense volunteers) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది యుద్ధ సమయాలు, సహజ విపత్తులు, లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో పౌరుల భద్రతను కాపాడటానికి వాలంటీర్లను నియమిస్తారు. ఇందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ జారీ అయింది. కాగా జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల పౌర రక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగింది.
ఈ నోటిఫికేషన్ (Notification) జారీ అయిన కొద్ది క్షణాల్లోనే వేలాది మంది యువకులు పౌర రక్షణ వాలంటీర్ (Civil Defense Volunteer)గా సేవలు అందించేందుకు పొటెత్తారు. ముఖ్యంగా చండీగఢ్ రాష్ట్రం (Chandigarh State)లో వేలాది మంది యువకులు తమ సర్టిఫికెట్లు పట్టుకొని అప్లికేషన్ కోసం పౌర రక్షణ విభాగం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఓ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. "మా దేశానికి మా సేవలను అందించడానికి మేము ఇక్కడ ఉన్నామని" చెప్పుకొచ్చాడు. అలాగే పౌర రక్షణ వాలంటీర్ల కోసం ప్రకటన అనంతరం రోడ్డు పైకి వచ్చిన ప్రజలు గుమిగూడి 'పాకిస్తాన్ ముర్దాబాద్' నినాదాలు చేశారు.






