తీవ్ర విషాదం.. భార్య చివరిచూపుకూ నోచుకోని ఆర్మీ జవాన్

by Ajay Maddhiboyina |

ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించింది. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా బార్డర్ వద్ద ఉగ్రమూకలను ఏరివేస్తూ పాక్ ఆర్మీతో పోరాడింది.

తీవ్ర విషాదం.. భార్య చివరిచూపుకూ నోచుకోని ఆర్మీ జవాన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించింది. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా బార్డర్ వద్ద ఉగ్రమూకలను ఏరివేస్తూ పాక్ ఆర్మీతో పోరాడింది. ఆకస్మికంగా సెలవులను రద్దు చేసినప్పటికీ ఆర్మీ దేశ ప్రజల కోసం పాక్ తో యుద్దం చేస్తూ అందరినీ కాపాడింది. ఇక తాజాగా ఓ గుండె తరుక్కుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య అంత్యక్రియలకు కూడా ఓ ఆర్మీ జవాన్ నోచుకోలేదు. ఒడిశాకు చెందిన దేబ్రాజ్ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే యుద్దవాతావరణం నేపథ్యంలో సెలవులు రద్దు చేయడంతో భార్య అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయాడు. దేబ్రాజ్ భార్య ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజుల క్రితం ఆమెకు బిడ్డ పుట్టగా అప్పటి నుండి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో దేబ్రాజ్ ఇంటివద్దే ఉండిపోయాడు. ఇటీవలేే ఆయన భార్యను విడిచి తిరిగి డ్యూటీలో చేరాడు. కాగా ఈనెల 13న దేబ్రాజ్ భార్య మరణిచింది. అయినప్పటికీ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాడు. అతడి 15 రోజుల బిడ్డ అనాథగా మారింది. ఈ ఘటన ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది.

Next Story