- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత సరిహద్దు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు
భారత సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనాధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను కూడా మూసివేయనున్నారు. పాక్ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ సముద్రం తీరం వెంట కోస్ట్ గార్డ్స్‌ను రౌండ్ ది క్లాక్ పహారా కాయాలని సూచించారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులును కూడా రద్దు చేశారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హమీపుర్, ఉనా, బిలాస్‌పుర్‌లో భద్రతా దళాలు రంగాలోకి దిగాయి. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని సూచించారు. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.
రంగంలోకి దిగిన సీఎం ఒమర్ అబ్దుల్లా..
గురువారం రాత్రి జమ్మూ వర్సిటీలో పాక్ డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన జమ్మూ వెళ్తున్నారు.






