ఆపరేషన్ సిందూర్‌పై మెగాస్టార్ సంచలన పోస్ట్.. ఇన్నాళ్లు కోమాలో ఉన్నావా.. ఇండైరెక్ట్‌గా మోడీని..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-11 09:49:02  IST  )

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంచలన ట్వీట్ చేశాడు. సిరీస్ ఆఫ్ బ్లాంక్ పోస్టుల తర్వాత హృదయాన్ని కదిలించే పోస్ట్ పెట్టాడు. ‘‘ హాలిడేస్‌లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన భార్యాభర్తలను బయటకు లాగిన రాక్షసుడు.. భర్తను నగ్నంగా మార్చి..

ఆపరేషన్ సిందూర్‌పై మెగాస్టార్ సంచలన పోస్ట్.. ఇన్నాళ్లు కోమాలో ఉన్నావా.. ఇండైరెక్ట్‌గా మోడీని..
X

దిశ, ఫీచర్స్ : మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంచలన ట్వీట్ చేశాడు. సిరీస్ ఆఫ్ బ్లాంక్ పోస్టుల తర్వాత హృదయాన్ని కదిలించే పోస్ట్ పెట్టాడు. ‘‘ హాలిడేస్‌లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన భార్యాభర్తలను బయటకు లాగిన రాక్షసుడు.. భర్తను నగ్నంగా మార్చి.. చేయాలనుకున్న పని చేశాక.. అతన్ని కాల్చడం ప్రారంభించాడు. భార్య కాళ్లపై పడి ఏడుస్తూ తన భర్తన చంపొద్దని వేడుకున్నా.. ఆ పిరికి రాక్షసుడు అత్యంత కిరాతకంగా భర్తను కాల్చి ఆమెను విధవగా మార్చేశాడు. భార్య ‘నన్ను కూడా చంపు’ అని మొరపెట్టుకోగా.. లేదు నువ్వు వెళ్లి ‘...’కి చెప్పు అని హెచ్చరించగా.. ఆ కుమార్తె ‘…’ వద్దకు వెళ్లి ఇలా అన్నట్లు ఊహించుకోండి అంటూ రాసుకొచ్చాడు. ‘చిత బూడిదలో ఉంది.. ప్రపంచం సిందూరం కోరుతోంది’.. అప్పుడు ‘...’ నీకు సిందూరం ఇచ్చాను!!! ఆపరేషన్ సిందూర్!!!’ అంటూ హామీ ఇచ్చాడని గుండెలను పిండేసే లైన్స్ రాసుకొచ్చాడు. ఇండైరెక్ట్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి చెప్పాడు.

కానీ నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్‌తో సంతృప్తి చెందలేదనిపిస్తుంది. ఆపరేషన్ సిందూర్‌పై ట్వీట్ వేయాల్సింది ఇప్పుడా.. ఇన్ని రోజులు కోమాలో ఉన్నావా అంకుల్ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం కొన్ని సార్లు మౌనమే గొప్పగా మాట్లాడుతుందని సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్టిస్టులను సపోర్ట్ చేయకుండా బలుచిస్తాన్, ఆప్ఘనిస్తాన్ నటులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

Next Story