Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై అల్లు అర్జున్ సంచలన పోస్ట్.. దారుణంగా హర్ట్ అయిన ఫ్యాన్స్.. పోస్ట్ డిలీట్ చేయాలని డిమాండ్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-08 13:17:54  IST  )

ఆపరేషన్ సిందూర్.. గ్లోబల్ వైడ్ టాపిక్.. కానీ ఇండియన్ సెలబ్రిటీలు మాత్రం కనీసం దీనిపై పోస్టులు పెట్టేందుకు ముందుకు రాలేదు. భారత ప్రభుత్వానికి మద్దతివ్వలేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ఫ్యామిలీస్‌పై ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై అల్లు అర్జున్ సంచలన పోస్ట్.. దారుణంగా హర్ట్ అయిన ఫ్యాన్స్.. పోస్ట్ డిలీట్ చేయాలని డిమాండ్..
X

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్.. గ్లోబల్ వైడ్ టాపిక్.. కానీ ఇండియన్ సెలబ్రిటీలు మాత్రం కనీసం దీనిపై పోస్టులు పెట్టేందుకు ముందుకు రాలేదు. భారత ప్రభుత్వానికి మద్దతివ్వలేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ఫ్యామిలీస్‌పై ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తున్నారా అని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ కలిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఆపరేషన్ సిందూర్‌పై ‘‘ మే బీ జస్టిస్ సర్వ్‌డ్.. జై హింద్’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టాడు. ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. నేషన్ ఫస్ట్ అని నిరూపించాడు.

అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతుంటే.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. మా అభిమాన హీరో నుంచి ఇలాంటి పోస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ ఫీల్ అయిపోతున్నారు. పేరాగ్రాఫ్‌లకు పేరాగ్రాఫ్‌లు కామెంట్స్ పెడుతున్నారు. 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్‌మెంట్ రియాక్షన్స్‌తో పోస్ట్ ట్రెండింగ్‌లో ఉండగా.. కొందరు ఆ పోస్ట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ డిస్కషన్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి బన్నీకి ఇంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Next Story