ప్రయాణికులకు అలర్ట్..రేపటి నుంచి ఎయిర్ ఇండియా కొత్త రూల్స్

by velandi.Saikiran |

ఇండియా ( India )వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ( Air India) కీలక నిర్ణయం

ప్రయాణికులకు అలర్ట్..రేపటి నుంచి ఎయిర్ ఇండియా కొత్త రూల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా ( India )వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ( Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ ( Airlines Travel Advisory) జారీ చేసింది ఎయిర్ ఇండియా. చెక్-ఇన్ కోసం మూడు గంటల ముందే ఎయిర్‌పోర్టుకు రావాలని సూచనలు జారీ చేసింది.

విమానం కదలడానికి 75 నిమిషాల ముందే చెక్-ఇన్ ముగుస్తుందని ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఈ మేరకు ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయన్న ఎయిర్ ఇండియా... స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడంలేదు. భారత పౌరులపై దాడులకు దిగుతోంది. ఉరి సెక్టార్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ దాడులు చేస్తోంది. షెల్స్ ప్రయోగించగా.. ఒక హోటల్ సమీపంలో పేలుడు సంభవింవించింది. దీంతో.. అక్కడ మంటలు చెలరేగాయి. దీనికి సంభందించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

Next Story