- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె.. వేలాదిగా పోటెత్తిన మహిళా భక్తులు
విజయవాడ దుర్గమ్మ సన్నిధికి మహిళా భక్తులు పోటెత్తారు. ఆషాడమాసం, ఆదివారం కావడంతో అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గమ్మ సన్నిధికి మహిళా భక్తులు పోటెత్తారు. ఆషాడమాసం, ఆదివారం కావడంతో అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 23 వేల మంది మహిళా భక్తులు సారె సమర్పించారు. దీంతో సారె సమర్పించే భక్తులకే పూర్తిగా రూ. 100 క్యూలన్ ను కేటాయించారు. డిజిటల్ స్కానింగ్ విధానంతో భక్తుల రద్దీని ఆలయ సిబ్బంది క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ మార్గాల గుండా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. మహిళల రాకతో క్యూ లైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. పలు ప్రాంతాల నుంచి మహిళలు పసుపు, కుంకుమ, చీరలు, గాజులు తదితర సారె సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
Next Story






