- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోదీతో అజిత్ దోవల్ కీలక భేటీ.. అసలు విషయం ఇదే!
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack)కు బదులుగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack)కు బదులుగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ నుంచి తేరుకున్న పాక్ సైన్యం సరిహద్దుల్లో భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై దాయాది బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి.
అయితే, ఆ కాల్పులను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ ముగిసిన తరుణంలో ఇవాళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ మేరకు దాయాది పాక్‌పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. సరిహద్దు భద్రత, LOC వెంట జరగుతోన్నఫైరింగ్, అక్కడి ప్రజల బాగోగులపై సమాలోచనలు చేయనున్నారు. అదేవిధంగా యుద్ధం వస్తే త్రివిధ దళాల సన్నద్ధతపై ప్రధాని, అజిత్ దోవల్‌ను అడిగి తెలుసుకోనున్నారు.






