కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్...జమ్మూలో భారీ శబ్దాలు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-11 12:06:13  IST  )

పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల

కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్...జమ్మూలో భారీ శబ్దాలు !
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్... మూడు గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసినట్లు సమాచారం అందుతోంది. జమ్ము కాశ్మీర్ లోని అనంత నాగ్, బుడ్గం, శ్రీనగర్, రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్ లాంటి ప్రాంతాలలో అనుమానాస్పద డ్రోన్స్ ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు.. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతోందని చెబుతున్నారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారి ప్రకటన చేయలేదు భారత ఆర్మీ. ఇక అటు ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధ్రువీకరించారు. కాసేపటికి క్రితమే జమ్మూ కాశ్మీర్ లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.

Next Story