రంగంలోకి దిగిన వాయుసేన... పేషావర్‌‌పై బాంబుల వర్షం

by Kema Shiva Kumar |

డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడిన పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు పూనుకుంది.

రంగంలోకి దిగిన వాయుసేన... పేషావర్‌‌పై బాంబుల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడిన పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు పూనుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ మేరకు పెషావర్, లాహార్‌‌ నగరాలపై బాంబుల మోత మోగిస్తోంది. ఇక భారత సరిహద్దులోని యూరీలో పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడుతోంది. దీంతో తీవ్ర భయాందోళకు గురైన జనం ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. క్వాట్టా నగరంతో పాటు, పాకిస్థాన్ ఫ్రాంటియర్ కోర్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఎటాక్ చేసింది. ఓ వైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులతో పాక్ రక్త కన్నీరు పెడుతోంది.

Next Story