- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీభవన్‌కు 350 మంది తెలుగు విద్యార్థులు
ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంగిస్తూ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ దాడులను తిప్పికొట్టడంతో పాటూ అవసరం అయితే తగినవిధంగా బుధ్ది చెప్పాలని భారత్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. దీంతో సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ లో చదువుతున్న ఏపీ తెలంగాణ విద్యార్థులు ఆ రాష్ట్రాలని వీడుతున్నారు.
ఇప్పటికే మొత్తం 476 మంది ఆ రాష్ట్రాల నుండి వచ్చేసినట్టు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. వారిలో 350 మంది విద్యార్థులు ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. 90 మంది వారి ఇండ్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. మరో 260 మంది విద్యార్థులు తమ సంరక్షణలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీ భవన్ లో ఉన్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏపీ సర్కార్ ఉచితంగా కల్పిస్తోంది. వారిని స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తోంది.






