గురుద్వారపై పాకిస్థాన్ దాడి..16మంది భారత పౌరులు మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-08 13:40:00  IST  )

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.

గురుద్వారపై పాకిస్థాన్ దాడి..16మంది భారత పౌరులు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపేందుకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రజలను మతపరంగా మభ్యపెట్టడానికి మతాన్ని వాడుకుంటోందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం పూంచ్‌లోని గురుద్వార్ పై మరియు సిక్కుల ఇండ్లపై దాడి చేసిందని చెప్పారు. సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నాారు. దాడిలో 16 మంది పౌరులు మరణించారని అన్నారు. అనేక మంది గాయపడినట్టు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసిందని చెప్పారు. పాకిస్థాన్ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని, భారత్ చేపట్టిన ఆపరేషన్ పహల్గామ్ దాడికి ప్రతిస్పందన మాత్రమే అని చెప్పారు. పాక్ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Next Story