Breaking: ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాలు రద్దు

by Ajay kumar |   ( Updated:2025-05-09 10:54:42.0  )
Breaking: ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య ఉధ్రిక్తతలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి పాక్ భారత్‌పై దాడులు చేయడంతో పాటూ జమ్మూలోని విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తూ రాకెట్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు అలర్ట్ అయ్యాయి. దేశంలోని కొన్ని ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 138 విమానాలను రద్దు చేసినట్టు సమాచారం. రద్దు చేసిన విమానాల్లో 4 ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే ఇంటర్నేషనల్ విమానాలు, 5 ఢిల్లీ నుండి వెళ్లే ఇంటర్నేషనల్ విమానాలు, 63 ఢిల్లీకి వచ్చే డొమెస్టిక్ విమానాలు, 66 ఢిల్లీ నుండి వెళ్లే డొమెస్టిక్ విమానాలు ఉన్నాయి. దీంతో కేవలం కొన్ని విమానాలు మాత్రమే రద్దు చేశామని విమానాశ్రయం తెరిచి ఉంటుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ విభాగం పేర్కొంది. మిగితా విమానాలు యతావిథిగా నడుస్తాయని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed