కొమురం భీం జిల్లాలో ఆపరేషన్ టైగర్

by  |
కొమురం భీం జిల్లాలో ఆపరేషన్ టైగర్
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులిని బంధించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. బెజ్జూరు, దహేగాం మండలాల్లోని 52 గ్రామాల్లో అధికారులు నిఘా ఉంచారు. పులికి ఎరగా ఆవులను ఉంచుతున్నారు. 340 కెమెరాలు, 60 మంది టైగర్ ట్రాకర్లతో పులి కదలికలపై నిఘా పెట్టారు.

కాగా, గుండ్లపల్లిలో ఏ-2 టైగర్ కెమెరాలకు చిక్కింది. బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఎరవేసిన పశువును పులి హతమార్చింది. మళ్లీ ఇక్కడికే వస్తుందన్న అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లను రంగంలోకి దింపారు.


Next Story

Most Viewed