ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి

38

దిశ, తాండూర్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యాలాల మండలంలో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే…మండలంలోని చిలకల వాగులో నలుగురు స్నేహితులు ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో వారంతా వాగులో చిక్కుకు పోయారు. కాగా అరుపులు విని స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారిలో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా రక్షించగా..ఒకరు మృతి చెందారు. మృతున్ని పెద్దేముల్ మండలం ముంబాపూర్ గ్రామానికి చెందిన రిహాన్(11)గా పోలీసులు గుర్తించారు.