- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: ఇల్లందు ఎమ్మెల్యే అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ శనివారం నిట్ట సుదర్శన్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే… 2018లో సుదర్శన్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గా పోటీ చేశాడు. కాగా పోటీ చేసింది మొదలు తాము చెప్పిన మాటలను వినడం లేదన్న కారణంతో సుదర్శన్ ను హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు. ఆ సమయంలో సుదర్శన్ చేతి వేళ్లు తెగి తృటిలో తప్పించుకున్నాడు. అయితే […]</p>

X
దిశ, కొత్తగూడెం:
ఇల్లందు ఎమ్మెల్యే అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ శనివారం నిట్ట సుదర్శన్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే… 2018లో సుదర్శన్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గా పోటీ చేశాడు. కాగా పోటీ చేసింది మొదలు తాము చెప్పిన మాటలను వినడం లేదన్న కారణంతో సుదర్శన్ ను హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు. ఆ సమయంలో సుదర్శన్ చేతి వేళ్లు తెగి తృటిలో తప్పించుకున్నాడు.
అయితే మళ్లీ ఆగస్టు నెలలో మలమద్ది రవి, అతని అనుచరులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారనీ సుదర్శన్ తెలిపారు. కాగా వారిని ప్రతిఘటించిన తన పై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆయన తెలిపారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని లేదంటే టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని సుదర్శన్ హెచ్చరించారు.
Next Story






