- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్స్ నగ్న చిత్రాలు.. ఆనందంలో ‘ఆమె’ప్రియుడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో వక్రబుద్ధి పెరుగుతోంది. సద్వినియోగం చేసుకోవాల్సిన వాటిని.. అక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇలా ఇంటా, బయట ‘ఆమె’ను ఓ కన్ను వెంటాడుతూనే ఉంది. నేటి రోజుల్లో ఏ ఒక్కరినీ నమ్మే పరిస్థితి లేకుండా టెక్నాలజీ మారుస్తోంది. తాజాగా తోటి నర్స్ నగ్న వీడియోలను తీసి మరో నర్స్ తన వికృత రూపాన్ని బయటపెట్టుకుంది. ఆమెతోనే ఉంటూ.. ఆమెకే తెలియకుండా నగ్న వీడియోలు తీసి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అశ్విని నర్సుగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో వక్రబుద్ధి పెరుగుతోంది. సద్వినియోగం చేసుకోవాల్సిన వాటిని.. అక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇలా ఇంటా, బయట ‘ఆమె’ను ఓ కన్ను వెంటాడుతూనే ఉంది. నేటి రోజుల్లో ఏ ఒక్కరినీ నమ్మే పరిస్థితి లేకుండా టెక్నాలజీ మారుస్తోంది. తాజాగా తోటి నర్స్ నగ్న వీడియోలను తీసి మరో నర్స్ తన వికృత రూపాన్ని బయటపెట్టుకుంది. ఆమెతోనే ఉంటూ.. ఆమెకే తెలియకుండా నగ్న వీడియోలు తీసి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పని చేస్తోంది. అక్కడ అత్యవసర సేవల విభాగంలో పని చేసే వారికి హాస్టల్ వసతి కల్పిస్తారు. దీనిని అనుకూలంగా మార్చకున్న అశ్విని.. తన తోటి నర్సు స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా బాత్ రూంలో కెమెరా పెట్టి వీడియోలు, ఫోటోలు తీసింది. ఆ తర్వాత వాటిని తన ప్రియుడికి పంపి పైశాచిక ఆనందం పొందింది.
అయితే ఎప్పటిలానే ఈనెల 5న ఓ నర్సు స్నానం చేస్తుండగా బాత్ రూంలో మొబైల్ కనిపించింది. షాక్ తిన్న ఆమె దానిని పరిశీలించగా వీడియో రికార్డింగ్ లో ఉన్నది. ఆ మొబైల్ అశ్వినిదిగా గుర్తించిన నర్సు.. హాస్టల్ ఇన్‌చార్జ్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. నర్సు అశ్వినిని అరెస్ట్ చేసిన పోలీసులు… పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.






