ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి

by Batti.Sumithra |   (  Updated:2021-09-07 06:56:22  IST  )

<p>దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మిట్టపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పరశురామ్ (38) మంగళవారం తండ్రి రామ్‌జీతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మిట్టపల్లి ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరశురామ్ తలకు తీవ్ర గాయం అయింది. చెవి, నోటి నుంచి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రామ్‌జీకి కూడా [&hellip;]</p>

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
X

దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మిట్టపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పరశురామ్ (38) మంగళవారం తండ్రి రామ్‌జీతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మిట్టపల్లి ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరశురామ్ తలకు తీవ్ర గాయం అయింది. చెవి, నోటి నుంచి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రామ్‌జీకి కూడా తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు.

Next Story