- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్‌లో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ వెస్ట్‌మారేడుపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పల్టీలు కొట్టగా దానిపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయ్యింది. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అఖిల్ అనే యువకుడు ర్యాష్ డ్రైవింగ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ వెస్ట్‌మారేడుపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పల్టీలు కొట్టగా దానిపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయ్యింది. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అఖిల్ అనే యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story






