ఘోర ప్రమాదం.. పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్

150
road accident

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా తూప్రాన్ నుంచి నగరానికి వస్తున్న టిప్పర్ రాంగ్ రూటులో వచ్చి ఢివైడర్ ఎక్కి కార్మికులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..