ప్రగతి భవన్‌లో రాఖీ సందడి

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: రక్షా బంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన నలుగురు అక్కలు రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌కు సైతం సోదరి కవిత రాఖీ కట్టారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు కవిత రాఖీ కట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక బంగళా అయిన ప్రగతి భవన్‌లో ప్రతీ ఏటా రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన సోదరీమణులు ప్రగతి భవన్ వచ్చి రాఖీ కట్టడం ఆనవాయితీ. ఈసారి కూడా అలాగే కట్టారు. పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు [&hellip;]</p>

ప్రగతి భవన్‌లో రాఖీ సందడి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రక్షా బంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన నలుగురు అక్కలు రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌కు సైతం సోదరి కవిత రాఖీ కట్టారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు కవిత రాఖీ కట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక బంగళా అయిన ప్రగతి భవన్‌లో ప్రతీ ఏటా రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన సోదరీమణులు ప్రగతి భవన్ వచ్చి రాఖీ కట్టడం ఆనవాయితీ. ఈసారి కూడా అలాగే కట్టారు. పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రగతి భవన్ వచ్చి సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టారు. మరోవైపు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్లాస్మా దాతలతో రాఖీ పండుగను జరుపుకున్నారు.

Next Story