తొలి రోజే విమాన ప్రయాణికుడికి పాజిటివ్

by Shamantha N |   (  Updated:2020-05-26 08:57:20  IST  )

<p>చెన్నై: దేశీయ విమానసేవలు ప్రారంభమైన తొలి రోజే ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను ఇండిగో ఫ్లైట్ 6ఈ381లో చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు ప్రయాణించాడు. కోయంబత్తూర్‌కు చేరిన తర్వాత ప్రయాణికులందరినీ పరీక్షిస్తుండగా.. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత వినాయక్ హోటల్‌లో అతన్ని క్వారంటైన్‌లో ఉంచి అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్‌కు తరలించారు. అతను ప్రయాణించిన రోజు(సోమవారం) చెన్నైలో 19 విమానాలు టేకాఫ్ కాగా, 16 విమానాలు ల్యాండ్ అయ్యాయి.</p>

తొలి రోజే విమాన ప్రయాణికుడికి పాజిటివ్
X

చెన్నై: దేశీయ విమానసేవలు ప్రారంభమైన తొలి రోజే ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను ఇండిగో ఫ్లైట్ 6ఈ381లో చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు ప్రయాణించాడు. కోయంబత్తూర్‌కు చేరిన తర్వాత ప్రయాణికులందరినీ పరీక్షిస్తుండగా.. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత వినాయక్ హోటల్‌లో అతన్ని క్వారంటైన్‌లో ఉంచి అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్‌కు తరలించారు. అతను ప్రయాణించిన రోజు(సోమవారం) చెన్నైలో 19 విమానాలు టేకాఫ్ కాగా, 16 విమానాలు ల్యాండ్ అయ్యాయి.

Next Story