భారత టెన్నిస్ దిగ్గజాలను విడదీసిన గర్ల్‌ఫ్రెండ్

by  |
Leander Paes
X

దిశ, సినిమా: భారత టెన్నిస్ దిగ్గజాలు ‘లియాండర్ పేస్, మహేశ్ భూపతి’ రియల్ స్టోరీగా తెరకెక్కిన ‘బ్రేక్ పాయింట్’ డాక్యుమెంటరీ సిరీస్ గతవారమే జీ5లో రిలీజైంది. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ టెన్నిస్ టీమ్‌గా చరిత్ర సృష్టించడం నుంచి వివాదాలతో విడిపోవడం వరకు అనేక విషయాలను వివరించింది. 1999 ఫ్రెంచ్ ఓపెన్ మెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత, ఒకరిపై మరొకరికి కలిగిన అపనమ్మకం, అపార్థాలు, ఇగో ఇష్యూస్ కారణంగా ఈ టెన్నిస్ దిగ్గజాలు విడిపోగా.. మరుసటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ ఆడేందుకు వేర్వేరు భాగస్వాములను ఎంచుకునేంతలా వారిమధ్య దూరం పెరిగిపోయింది. అయితే, తమ సమస్యలను ఒకరికొకరు పరిష్కరించుకునే క్రమంలో ‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో నువ్వు క్లోజ్‌గా ఉంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి’ అని లియాండర్ చెప్పడంతో మహేశ్ ఆశ్చర్యపోయాడు. ఇది నిజమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? అని అడిగితే.. లియాండర్ నుంచి అవుననే సమాధానం రావడంతో వారి పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. అంతటితో ఫ్రెంచ్ ఓపెన్ డిస్కషన్ ముగిసింది.

అయితే లియాండర్ సూచించిన మహిళ ఎవరో తెలియదు కానీ.. 2000 ప్రారంభంలో మహేశ్‌తో విడిపోవడానికి ముందు అతను నటి మహిమా చౌదరితో కొంతకాలం డేటింగ్ చేశాడు. కాగా, సంజయ్ దత్ రెండవ భార్య రియా పిళ్లైతో రిలేషన్‌లో ఉన్నాడు. ఒక కూతురు పుట్టిన తర్వాత తనతోనూ విడిపోగా.. ప్రస్తుతం నటుడు కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. ఇక మహేశ్ విషయానికొస్తే 2002లో శ్వేత జైశంకర్‌ను మ్యారేజ్ చేసుకుని, ఏడేళ్ల తర్వాత విడిపోయాడు. ఫైనల్‌గా 2011లో నటి లారా దత్తాను వివాహం చేసుకోగా.. వీరికి సైరా అనే కుమార్తె కూడా ఉంది.


Next Story