నేపాల్ ప్రధానిగా ఓలీ పునర్నియామకం

48

ఖాట్మాండు: నేపాల్ ప్రధానిగా కె.పి ఓలీ పునర్నియామకమయ్యారు. గత సోమవారం ఆయన నేపాల్ పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి బిద్యా దేవి భండారి గురువారం రాత్రి 9వరకు గడువు పెట్టారు. ఈలోపు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. దీంతో ప్రధానిగా కె.పి ఓలీనే పునర్నియమిస్తున్నట్టు భండారి వెల్లడించారు. కాగా, శుక్రవారం ప్రమాణం చేయనున్న ఓలీ.. 30రోజుల్లోగా మెజార్టీ మద్దతును సాధించుకోవాల్సి ఉంటుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..