- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో దారుణం.. చెట్టుకు కట్టేసి గొంతులో పొడిచి..
<p>దిశ, వరంగల్ రూరల్ /పరకాల (సంగెం) : చెట్టుకు కట్టేసి హంస సంపత్ అనే రైతు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన ఘటన సంగం మండలంలో కలకలం రేపుతోంది. గత రెండు రోజుల కిందట వరంగల్ నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో జరిగిన హత్య ఘటన మరువకముందే గురువారం రాత్రి మరో ఘటన జరగడం జిల్లాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం.. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన హంస సంపత్ (55) గురువారం […]</p>

దిశ, వరంగల్ రూరల్ /పరకాల (సంగెం) : చెట్టుకు కట్టేసి హంస సంపత్ అనే రైతు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన ఘటన సంగం మండలంలో కలకలం రేపుతోంది. గత రెండు రోజుల కిందట వరంగల్ నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో జరిగిన హత్య ఘటన మరువకముందే గురువారం రాత్రి మరో ఘటన జరగడం జిల్లాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం.. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన హంస సంపత్ (55) గురువారం రాత్రి ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళల్లో సంపత్‌ను అతని ఇంటి ముందు చెట్టుకు కట్టేసి అరటి పండ్లు కోసే కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు.
హత్యకు కారణం తమ్ముడేనా..?
హంస సంపతు అతడి తమ్ముడు చలపతిలకు మధ్య గత కొంతకాలం నుంచి ఆస్తి వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గత రాత్రి సంపత్ ఈరోజు జరగనున్న అన్నదమ్ముల పంచాయతీ విషయమై గ్రామ సర్పంచ్‌తో సహా పలువురు పెద్దమనుషులను కలిసి రేపు పంచాయతీకి రావలసిందిగా కోరాడు.ఈ క్రమంలోనే సంపత్ హత్యకు గురికావడంతో చలపతే హత్యచేసి ఉంటాడా.. అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదిఏమైనా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
- Tags
- murder






