- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాజిటివ్ వచ్చిందని చెరువులో దూకింది
by Batti.Sumithra |
<p>దిశ, బోధన్ : కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వృద్ధురాలు చెరువులో దూకింది. ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..కాడికే కుర్మే భూదేవి(60) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి నుండి కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా దొరకలేదు. తీరా మంగళవారం శివారులోని ఊర చెరువులో భూదేవి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి బంధువులకు […]</p>

X
దిశ, బోధన్ : కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వృద్ధురాలు చెరువులో దూకింది. ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..కాడికే కుర్మే భూదేవి(60) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి నుండి కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా దొరకలేదు. తీరా మంగళవారం శివారులోని ఊర చెరువులో భూదేవి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి బంధువులకు శవాన్ని అప్పజెప్పారు. విచారణలో భాగంగా భూదేవికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ భయంతో వృద్ధురాలు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్ఐ లోకం సందీప్ తెలిపారు.
Next Story






