- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిపై కారం చల్లి చోరీ.. దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలి మొహంపై కారం చల్లిన దుండగులు ఆమె ఒంటిపై ఆభరణాలు దొంగిలించడమే కాకుండా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడమనూరు మండలం ఇండ్ల కోటయ్య గూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇండ్ల అఖిలాండమ్మ (60) అనే వృద్ధురాలి ముఖంపై కారం చల్లి, ఆభరణాలు చోరీ చేయడమే కాకుండా హతమర్చారు. అయితే, అఖిలాండమ్మ బయటకు రావడం లేదని గమనించిన స్థానికులు ఇంట్లోకి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలి మొహంపై కారం చల్లిన దుండగులు ఆమె ఒంటిపై ఆభరణాలు దొంగిలించడమే కాకుండా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడమనూరు మండలం ఇండ్ల కోటయ్య గూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇండ్ల అఖిలాండమ్మ (60) అనే వృద్ధురాలి ముఖంపై కారం చల్లి, ఆభరణాలు చోరీ చేయడమే కాకుండా హతమర్చారు.
అయితే, అఖిలాండమ్మ బయటకు రావడం లేదని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై చలనం లేకుండా వివస్ర్తగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడటంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగి ఉండచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ రాఘవులు తెలిపారు. పోస్తుమార్టం నిమిత్తం మృతదేహన్ని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.






