- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వృద్ధురాలు మృతి
by Shyam |
<p>దిశ, వరంగల్: బైకును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా కేంద్రం భూపాలపల్లిలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం భూపాలపల్లి మండలం గొర్లవేడుకు చెందిన బండారి భూమక్క(60) సమీప బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. కింద పడిపోయిన భూమక్కపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో […]</p>

X
దిశ, వరంగల్: బైకును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా కేంద్రం భూపాలపల్లిలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం భూపాలపల్లి మండలం గొర్లవేడుకు చెందిన బండారి భూమక్క(60) సమీప బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. కింద పడిపోయిన భూమక్కపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags : road accident, old women died, boopalapalli, truck hit
Next Story






