అందుబాటులో Ola ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఈ నగరాల్లోనే

by  |
ola
X

దిశ, వెబ్‌డెస్క్: Ola తన S1, S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని విస్తరించడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల డెలివరీలను డిసెంబర్ 16న బెంగళూరు, చెన్నైలో ప్రారంభించింది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని మొదలు పెట్టడానికి చూస్తోంది. అందులో భాగంగా Ola తన S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొత్తగా మరికొన్ని నగరాలకు డెలివరీని ప్రారంభించింది. ముంబై, పూణే, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోని కస్టమర్లకు డెలివరీ చేయడానికి అందుబాటులో ఉంటాయని ఓలా యాజమాన్యం ప్రకటించింది. Ola Electric S1 ధర రూ.లక్ష, S1 pro ధర రూ.1.30 లక్షలు. ఆండ్రాయిడ్ ఆధారిత OS, యాప్ కంట్రోల్, స్పీకర్, ఛార్జింగ్ కోసం USB పాయింట్, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌తో కూడిన పెద్ద డిస్‌ప్లే స్క్రీన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.


Next Story

Most Viewed