హిందీలో ‘మాస్టర్’రీమేక్.. మేకర్స్‌కు నెటిజన్ల సజెషన్స్

by  |
హిందీలో ‘మాస్టర్’రీమేక్.. మేకర్స్‌కు నెటిజన్ల సజెషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ‘మాస్టర్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టించింది. టాక్ ఎలా ఉన్నా సరే రికార్డుల వేట కొనసాగిస్తోంది. లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో తమిళ్‌లో తెరకెక్కిన సినిమా తెలుగు, హిందీలో డబ్ అయింది. బాలీవుడ్‌కు డబ్ అయినా సరే రీమేక్ చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్.

యావరేజ్ ఫిల్మ్ రీమేక్ చేయడంపై కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నా..విజయ్, సేతుపతి ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలను ఎవరూ రీప్లేస్ చేయలేరని చెప్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు అయితేనే సినిమాకు న్యాయం చేయగలడని..తనకే హిందీలో కూడా దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా, మాస్టర్‌లో విజయ్ ప్రొఫెసర్‌గా కనిపించగా.. స్టూడెంట్స్‌ను చెడగొట్టే డ్రగ్స్ సప్లైయర్‌గా టెరిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సేతుపతి.



Next Story