- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పచ్చని చెట్లు నిలువునా కా(కూ)ల్చేస్తున్నారు
<p>దిశ, భద్రాచలం: రహదారి పక్కన బాటసారులకు నీడనిచ్చే పచ్చని చెట్లు నిలువునా కా(కూ)లిపోతున్నాయి. ఈ వృక్ష విలాపాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కొందరు ఇటుక బట్టి నిర్వాహకులు చెట్లకు నిప్పుపెట్టి తగుల బెడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అర్ధరాత్రి జరిగే ఈ మాస్టర్ ప్లాన్ మూలం గా చర్లలో అర్‌అండ్‌బీ రహదారి పక్కన చెట్లు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నట్లు తెలుస్తోంది. పచ్చని చెట్లకు నిప్పు పె ట్టడంపై వృక్ష ప్రేమికులు మథనపడుతున్నారు. చర్లలో ఇటు క కాల్చడానికి కలప కొరత […]</p>

దిశ, భద్రాచలం: రహదారి పక్కన బాటసారులకు నీడనిచ్చే పచ్చని చెట్లు నిలువునా కా(కూ)లిపోతున్నాయి. ఈ వృక్ష విలాపాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కొందరు ఇటుక బట్టి నిర్వాహకులు చెట్లకు నిప్పుపెట్టి తగుల బెడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అర్ధరాత్రి జరిగే ఈ మాస్టర్ ప్లాన్ మూలం గా చర్లలో అర్‌అండ్‌బీ రహదారి పక్కన చెట్లు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నట్లు తెలుస్తోంది. పచ్చని చెట్లకు నిప్పు పె ట్టడంపై వృక్ష ప్రేమికులు మథనపడుతున్నారు. చర్లలో ఇటు క కాల్చడానికి కలప కొరత ఏర్పడడంతో కొందరు ఇటుక బట్టిల నిర్వాహకులు తెలివిగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎవరి కంటపడకుండా చెట్టుకు రధ్రం చేసి పె ట్రోల్, కిరోసిన్ పోసి తగులబెట్టి చెట్టు కిందపడిపోయాక దా న్ని ఆర్పి, కాలి పడిపోయిన చెట్టు వంకతో ఆర్‌అండ్‌బి అధికారులకో, సిబ్బందికో సదరు స్వార్థపరులు ఎంతోకొంత చే తిలో పెట్టి పడిపోయిన (పడగొట్టిన) చెట్టుని ఇటుక బట్టీలకు తరలించుక పోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
కన్నుపడితే ఖతమే..
దారి పక్కన కాసింత ఎండినట్లుగా చెట్టు కనపడినా, ఆ చెట్టుపై స్మగ్లర్ల (ఇటుక వ్యాపారుల) కన్నుపడితే ఖతమే అని చర్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ ఇటుక బట్టి వ్యాపారి ఇదే పనిగా తమ పబ్బం గడుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటుక కాల్చడానికి కలప, ఊక (వరి పొట్టు) వంటివి కొనే అవసరం లేకుండా దారి పక్కన చెట్లు తెలివిగా తగులబెట్టిస్తుంటారని సమాచారం. అంతేగాక ఎవరి కంటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. ఒకవేళ ఎక్కడైనా చిక్కితే తమ రాజకీయ పరపతి, పలుకుబడి ఉపయోగించి గండం నుంచి గట్టెక్కుతారని వినికిడి.
ప్రభుత్వ ఆశయానికి గండి..
మానవాళి మనుగడ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చెట్ల పెంపకానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తద్వారా మొక్కలునాటి పెంచడానికి బోలెడు డబ్బులు ఖర్చుచేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు నానాతంటాలు పడుతుంటే, మరోవైపు పెరిగిన చెట్లను కొందరు స్వార్థపర శక్తులు నాశనం చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి పెడుతున్నారు. గతంలో అడవి నుంచి నాన్ టేకు కలప తెచ్చి ఇటుక బట్టిలు కాల్చేవారు. ఇపుడు అడవి కలపకి అటవీ అధికారులు చెక్ పెట్టడంతో రహదారి పక్కన చెట్లపై కన్నేసినట్లు సమాచారం. ముందుగా పచ్చని చెట్లు చచ్చిపోయేలా చేసి ఆ తర్వాత నిప్పు పెట్టి పడగొడతారని తెలుస్తోంది. ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న విషయమైనా బాగా ఆలోచిస్తే ప్రజలకు (పర్యావరణానికి) ఎంతో నష్టంచేసే అంశం అనేది యదార్థం.
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు..
రహదారి పక్కన చెట్లు ఎలా కాలుతున్నాయనేది ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇది ఆకతాయిల పని అనుకొంటున్నారే తప్పా స్వార్థపరుల పన్నాగమని కనిపెట్టలేకపోతున్నారు. చెట్లను కాపాడటంపై ఆర్‌అండ్‌బీ శాఖకి అంత పట్టింపు లేనట్లుగా కనిపిస్తోంది. కొంచెం నిఘా పెడితే చెట్లు కాల్చే దుర్మార్గులు ఇట్టే దొరికే చాన్స్ ఉంది. దీనిపై ఇప్పటికైనా ఆర్అండ్‌బీ అధికారులు దృష్టి పెట్టి దారి పక్కన చెట్లు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






