- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లె నిద్రలు తప్పనిసరి : కలెక్టర్
<p>గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఎంపీడీఓలు, ఏంపీఓలు పల్లె నిద్రలు తప్పనిసరిగా చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ, ఎంపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. ఏఏ గ్రామాల్లో ఎక్కువ లోటుపాట్లు ఉన్నాయో ముందస్తుగా గమనించి ఆ గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలన్నారు. పల్లె నిద్ర సందర్భంగా పల్లెప్రగతిలో ఆన్ గోయింగ్ […]</p>

గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఎంపీడీఓలు, ఏంపీఓలు పల్లె నిద్రలు తప్పనిసరిగా చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ, ఎంపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. ఏఏ గ్రామాల్లో ఎక్కువ లోటుపాట్లు ఉన్నాయో ముందస్తుగా గమనించి ఆ గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలన్నారు. పల్లె నిద్ర సందర్భంగా పల్లెప్రగతిలో ఆన్ గోయింగ్ పనులైన డంపింగ్ యార్డు, స్మశాన వాటిక, నర్సరీనీ భౌతికంగా పరిశీలన చేసి నర్సరీ జర్మినేషన్, ట్రాక్టర్లు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో చూడాలన్నారు. లోటుపాట్లను సవరించి ఆ గ్రామంలో పనుల వేగవంతానికి కృషి చేయాలని అవసరమైతే సెక్రటరీకి సర్పంచ్‌కు తగు సూచనలు చేయాలన్నారు. వారంలో 3రోజులు ఎంపీఓలు 2రోజులు ఎంపీడీఓలు పల్లె నిద్ర చేయలని ఆదేశించారు. సర్పచులకు సెక్రెటరీల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయాలని అదేశించించారు. బ్యాగ్ ఫిల్లింగ్ కర్వర్షన్ మొక్కలను నిర్దేశించిన లక్ష్యం మేరకు భౌతికంగా ఉండాలని అన్నారు. పల్లె ప్రగతి అమలు ప్రకృయను ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేస్తారని, ఆ సందర్భంలో కొత్తగా పెంచేవి కన్వర్షన్ చేసే మొక్కలు నిర్దేశించిన ప్రకారంగా లేని పక్షంలో ఇబ్బందులకు గురి కాక తప్పదని చెప్పారు. గ్రామాల్లో చెపట్టుతున్న పనులకు రెండు రోజులకోసారి పనుల ప్రగతిపై ఫోటోలు పంపించాలని, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు తొందరగా కొనుగోలు చేయాలని, వాటిని మిస్‌యూజ్ చేయవద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







